గుడ్లవల్లేరు హాస్టల్ హిడెన్ కెమెరాల వివాదం….ఐజీ కీలక ప్రకటన…
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ప్రకంపనలు రేపిన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌లో హిడెన్ కెమెరాల ఆరోపణల వ్యవహారంపై ఐజీ అశోక్ కుమార్ కీలక ప్రకటన చేశారు. హాస్టల్‌లో కెమెరాలు చూసినట్లు ఎవరూ చెప్పలేదని ఆయన ప్రకటించారు. హిడెన్ కెమెరాలు, విద్యార్థినుల వీడియోల షేరింగ్ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. విద్యార్థినులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఐజీ అశోక్‌కుమార్ వివరించారు. 35 మంది విద్యార్థినులు, వార్డెన్లు, సిబ్బందిని ప్రశ్నించినట్టు ఆయన వెల్లడించారు. సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవడంతో…
