ఆంధ్రప్రదేశ్‌లో 50 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులు – రూ.25,256 కోట్ల పెట్టుబడులకు శ్రీకారం
ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తూ ముఖ్యమంత్రి “చంద్రబాబు నాయుడు” భారీ పారిశ్రామిక పండుగకు శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదఈర్లపాడులో ఏర్పాటు చేసిన “ఎంఎస్ఎంఈ పార్కును” ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా “17 జిల్లాల్లోని 50 ఎంఎస్ఎంఈ(MSME) పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటితో పాటు ఇప్పటికే ఉత్పాదన దశలో ఉన్న రూ.25,256 కోట్ల పెట్టుబడులతో 25 పరిశ్రమలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రెండో దశలో 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులు ప్రారంభించగా,…
