Vishaka Utsav 2026: 24న విశాఖ ఉత్సవ్ ప్రారంభం.. ఘనంగా పోస్టర్ ఆవిష్కరణ
Vishaka Utsav 2026: ఉత్తరాంధ్ర ప్రాంతంలోని సాంస్కృతిక సంపద, ప్రకృతి సౌందర్యాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ‘విశాఖ ఉత్సవ్’ను నిర్వహించనుంది. ‘సాగరం నుంచి శిఖరం వరకు’ అనే నినాదంతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రుల బృందం వెల్లడించింది. విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లపై మంగళవారం విశాఖ కలెక్టరేట్లో మంత్రుల బృందం సమీక్ష సమావేశం నిర్వహించింది. అనంతరం వీఎంఆర్డీఏ బాలల ప్రాంగణంలో…
