
జియో కొత్త ప్లాన్లతో కస్టమర్ల ఆకర్షణ
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీ వంటి టెలికం ఆపరేటర్లు ఇటీవల రీఛార్జ్ రేట్లను గణనీయంగా పెంచడంతో కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లక్షలాది మంది యూజర్లు పోర్ట్ అయ్యారంటూ కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యగా టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త వ్యాల్యూ యాడెడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. అపరిమిత కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలను అందించే ఆఫర్లను జియో ఆవిష్కరించింది. సాధారణంగా కాలింగ్, డేటా బెనిఫిట్స్…