అభయ సమయంలో అంబులెన్స్ సిబ్బంది మహిళపై లైంగిక వేధింపులు. రోగిని రోడ్డుపైనే విడిచిపెట్టి, ఆక్సిజన్ లేని కారణంగా మరణం.

ఉత్తరప్రదేశ్‌లో అంబులెన్స్ సిబ్బందిపై లైంగిక వేధింపులు

అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే అంబులెన్స్ సిబ్బందే ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఓవైపు అంబులెన్స్ వెనక సీట్లో రోగి ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. ముందుసీట్లో ఆ రోగి భార్యను వేధించారు. భర్త ఆరోగ్యంపై ఆందోళనతో ఉందనే జాలి కూడా లేకుండా మానవత్వం మరిచి ఈ దుర్మార్గానికి తలపడ్డారు. అంబులెన్స్ డ్రైవర్, అతడి సహాయకుడి వేధింపులను అడ్డుకోవడంతో నడి రోడ్డుపైనే రోగిని దించేసి వెళ్లిపోయారు. పోలీసులకు ఫోన్ చేసి భర్తను వేరే ఆసుపత్రికి తరలించుకునే ప్రయత్నం…

Read More
ఏపీలో పింఛన్ల పంపిణీకి 1.34లక్షల కొత్త ఫింగర్‌ప్రింట్ స్కానర్ల కొనుగోలు. సెక్యూరిటీ సవాల్లకు పరిష్కారం.

ఏపీలో పింఛన్ల పంపిణీలో కొత్త ఫింగర్‌ప్రింట్ స్కాన‌ర్లు

పింఛ‌న్ల పంపిణీలో కీల‌క మార్పు దిశ‌గా ఏపీలోని కూట‌మి స‌ర్కార్ అడుగులేస్తోంది. ఈ మేర‌కు తాజాగా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త కొంత‌కాలంగా సామాజిక పింఛ‌న్ల పంపిణీలో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌కలకు ఆస్కారం లేకుండా స‌రికొత్త ప‌ద్ద‌తితో ముందుకు వ‌స్తోంది.  దీనిలో భాగంగా ప్ర‌భుత్వం అత్యాధునిక ఎల్ ఆర్‌డీ (రిజిస్ట‌ర్డ్‌) ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ల‌ను కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించింది. దీనికోసం రూ. 53కోట్ల‌ను గ్రామ‌, వార్డు స‌చివాల‌య శాఖకు కేటాయించింది. దీంతో ఏపీ స‌ర్వీసెస్ టెక్నాల‌జీ ద్వారా డివైజ్‌ల…

Read More
హిమాలయ మంచు పొరల కింద 17,000 పురాతన వైరస్ జాతుల ఆనవాళ్లను గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు. నేచర్ జియోసైన్స్ లో నివేదిక.

హిమాలయ మంచు పొరల్లో 17వేల వైరస్ జాతుల ఆనవాళ్లు

హిమాలయ మంచు పొరల కింద అనేక రకాల వైరస్ జాతుల అనవాళ్లు ఉన్నాయి. సుమారు 17వేల ప్రాచీన వైరస్ జాతుల ఆనవాళ్లను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. టిబెట్ పీఠభూమిలో ఉన్న గలియా నుండి పర్వతాల్లో ఆ వైరస్‌లు ఉన్నట్లు కనుగొన్నారు. కొన్ని వైరస్‌లు సుమారు 40 సంవత్సరాల క్రితం నాటివిగా ఉన్నట్లు భావిస్తున్నారు. అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జీ పింగ్ జాంగ్ నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం ఆ వైరస్‌‌పై రీసెర్చ్ జరిపింది. నేచర్…

Read More
భారీ వర్షాలు, వరదలపై కేంద్ర బృందం ఏపీకి వచ్చి నష్టం అంచనాలు వేసేందుకు పర్యటించనుంది. 8 సభ్యుల బృందం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనుంది.

ముంపు ప్రాథమిక అంచనాలకు కేంద్ర బృందం ఏపీకి…

భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాల పంట ముంపునకు గురైంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు నష్టం అంచనాలకు కేంద్ర బృందం ఏపీకి వస్తోంది. రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాలైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో ఈ రోజు (గురువారం) కేంద్ర బృందం(ఇంటర్ మినిస్టీరియల్ టీం)పర్యటించనుంది. కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి…

Read More
రాజ్‌కోట్ కోట వద్ద శివాజీ విగ్రహం కూలిన కేసులో నిందితుడైన జయదీప్ ఆప్టే అరెస్టు. 7 బృందాలు కొరడా చేర్చడంతో పట్టుకోబడినాడు.

ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన కేసులో శిల్పి అరెస్ట్

రాజ్‌కోట్ కోట బయట ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన తర్వాత అదృశ్యమైన శిల్పి జయదీప్ ఆప్టే రెండు వారాల తర్వాత ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతడి పట్టుకునేందుకు పోలీసులు మొత్తం 7 బృందాలు ఏర్పాటు చేశారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ సచిన్ గుంజల్ సారథ్యంలో పోలీసు బృందం ఎట్టకేలకు నిందితుడిని కల్యాణ్‌లోని అతడి ఇంట్లో అరెస్ట్ చేసింది.  జయదీప్‌పై లుక్ అవుట్ నోటీసులుఇదే కేసులో ఇప్పటికే కన్సల్టెంట్ చేతన్ పాటిల్‌ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు…

Read More
తప్పుడు కేసు వేధింపులపై ఏపీ పోలీసులకు నటి కాదంబరి ఫిర్యాదు. విద్యాసాగర్ కుట్రలో భాగమని, కుటుంబానికి రక్షణ కోరుతూ మీడియా వాఖ్యలు.

కాదంబరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

సినీ నటి కాదంబరీ జత్వానీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాదంబరీ జత్వానీపై నమోదు చేసిన కేసులో ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలను తదుపరి విచారణ వరకూ భద్రపరచాలని ఇబ్రహీంపట్నం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాదంబరీపై ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటి వరకూ సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను నిందితురాలికి తిరిగి ఇవ్వకుండా భద్రపరిచేలా ఆదేశించాలని కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో దాఖలు…

Read More
ఉక్రెయిన్ వివాదం ముగింపునకు కృషి చేసే ఏ దేశానికైనా స్వాగతం పలుకుతామని అమెరికా ప్రకటించింది. మోదీ-జెలెన్‌స్కీ భేటీపై స్పందన.

ఉక్రెయిన్ వివాదంపై అమెరికా స్పందన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన విడుదల చేసింది. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య వివాదానికి ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్న ఏ దేశానికైనా స్వాగతం పలుకుతామని పేర్కొంది. ఉక్రెయిన్ ప్రజల ప్రత్యేక హక్కులు, శాంతిని కోరుకుంటున్న అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అనుగుణంగా కృషి చేయాలని, అలాంటి పాత్ర పోషించే దేశాన్ని తాము కచ్చితంగా స్వాగతిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు వైట్‌హౌస్ జాతీయ భద్రతా సమాచార…

Read More