
గోదావరి వరదలతో బెంబేలెత్తుతున్న లంకవాసులు, పాడి రైతుల ఆవేదన
గోదావరి మూడవసారి మళ్లీ పెరగడంతో లంకలు మునిగిపోయి లంకవాసులు భయాందోళనకు గురవుతున్నారు. వరద నీరు జామ, తామలపాకు, కూరగాయల పంటలను నాశనం చేసింది.లంకల్లోని పాడి రైతులు పశువులను ఏటి గట్లపైకి తీసుకురావడం ప్రారంభించారు. వరదలు పశువులకు మేతను దూరం చేయడంతో, కాస్త గడ్డి ఉన్న చోట వాటిని మేపుతున్నారు. డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ వద్ద వరద నీరు తాకడంతో పంటలు నాశనమయ్యాయి. నీట మునిగిన పంటల పరిస్థితి రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పశువులకు మేత కొరత…