
గజ్వేల్ గణపతి మండపం వద్ద ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గణపతి మండపం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, యువ నాయకుడు ఎన్ సీ సంతోష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం జరిగింది. గణపతి పూజల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకుని, అందరూ మత సహనంతో ఉన్నట్టు కార్యక్రమంలో పౌరులు తెలిపారు….