
గుమ్మలక్ష్మీపురం పర్యటనలో అడిషనల్ ఎస్పీ అంకితమహావీర్
గుమ్మలక్ష్మీపురం మండలంలో అడిషనల్ ఎస్పీ అంకితమహావీర్ ఐపీఎస్ గురువారం పర్యటించారు.మండల కేంద్రంలో ఉన్న ఎల్విన్ పేట పోలీస్ స్టేషన్ ను సందర్శించి రికార్డులను పరిశీలించారు.అలాగే సర్కిల్ పరిధిలో నేరనియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సిఐను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ గంజా వంటి మత్తు పదార్థాలకు బానిసలు అవ్వద్దు అని సూచించారు.ఆమె వెంట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి,ఎస్ఐ శివప్రసాద్ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.