
చింతవృక్షంలో వెలసిన అమ్మవారి రూపం
భైంసా మండలం వానల్ పాడ్ గ్రామంలో, ఎల్లమ్మ గుట్టపై దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న చింతవృక్షం కాండంపై విజయ దుర్గామాత స్వయంభుగా వెలసిందని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. అమ్మవారి రూపం కనబడడంతో, స్థానికులు అత్యంత ఆనందంగా మొక్కులు తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు. చింత చెట్టుపై ఈ అధ్భుతమైన దృశ్యం, గ్రామస్తుల మనసుల్లో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. రానున్న నవరాత్రి ఉత్సవాలలో ఈ ఆలయం మరింత శోభను సంతరించుకుంటుందని…