బాడీబిల్డర్, నటుడు వరీందర్ సింగ్ ఘుమన్ హఠాన్మరణం – బాలీవుడ్‌లో విషాదం
బాలీవుడ్ మరియు బాడీబిల్డింగ్ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. ప్రముఖ బాడీబిల్డర్, నటుడు వరీందర్ సింగ్ ఘుమన్ (42) గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. కేవలం 42 ఏళ్ల వయసులోనే ఆయన అకాల మరణం సినీ మరియు క్రీడా వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అమృత్‌సర్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 10 సాయంత్రం 5:30 గంటల సమయంలో వరీందర్ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మరణవార్తను పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎంపీ సుఖీందర్ సింగ్…
