రేపల్లె పట్టణంలో ప్రజాసంఘాలు పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావును గెలిపించాలని ప్రచారం నిర్వహించాయి. ఇందులో భాగంగా కోర్టు వద్ద న్యాయవాదులు, వివిధ సంస్థల్లో పనిచేసే పట్టభద్రులను కలిసి మద్దతు కోరారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి మాట్లాడుతూ శాసనమండలిలో పట్టభద్రులు, ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం ఉండటం ద్వారా హక్కులు కాపాడబడతాయని తెలిపారు.
రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ప్రభుత్వ విధానాలపై చట్టసభల్లో గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని రమాదేవి అన్నారు. ప్రజల వాణిని వినిపించేందుకు శాసనమండలిలో పిడిఎఫ్ అభ్యర్థులు గెలవాలని పిలుపునిచ్చారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పులను సమర్థంగా ఎదుర్కొనడానికి ప్రజాస్వామ్య వేదికలు బలపడాలని సూచించారు.
ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మోపిదేవి శ్రీనివాసరావు, జై భీమ్ పార్టీ ఇంచార్జ్ రమేష్ రాంజీ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కేసన. గోపాలరావు, సామాజిక నాయకులు దారం. సాంబశివరావు, మునిపల్లి. సుబ్బయ్య, కొన. శ్రీను తదితరులను కలిసి మద్దతు కోరారు. పట్టభద్రుల కోసం పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్. మణిలాల్, ఎస్ఎఫ్ఐ నాయకులు వై. నవీన్, పట్టణ ఆదర్శ వేదిక కన్వీనర్ వై. కిషోర్, డివైఎఫ్ఐ, సిఐటియు నాయకులు బిఎల్ కే. ప్రసాద్, కేవెంకట్, కే.ఆశీర్వాదం, కే. రమేష్, డి. ఆగస్టిన్, కేవీ. లక్ష్మణరావు, డి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.