వరుస ఓటములతో ఒత్తిడిలో సన్‌రైజర్స్

SRH struggles in IPL 2025 with three consecutive losses. Captain Pat Cummins expresses disappointment over the team's performance. SRH struggles in IPL 2025 with three consecutive losses. Captain Pat Cummins expresses disappointment over the team's performance.

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) తమ తొలి మ్యాచ్‌లో భారీ విజయం సాధించింది. అయితే, ఆ తర్వాత గాడితప్పి వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలు మూటగట్టుకుంది. ఎల్‌ఎస్‌జీపై 5 వికెట్ల తేడాతో, డీసీపై 7 వికెట్ల తేడాతో, కేకేఆర్ చేతిలో 80 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. వరుస ఓటములతో జట్టు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితిపై సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందించాడు. జట్టు ప్రదర్శన నిరాశాజనకంగా మారిందని, ఆటగాళ్లు సమష్టిగా రాణించలేకపోతున్నారని తెలిపాడు. బౌలింగ్ పరంగా మెరుగ్గా ఉన్నా, బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ విభాగాల్లో తగిన మద్దతు లేకపోవడంతో వరుస ఓటములు ఎదురవుతున్నాయని పేర్కొన్నాడు. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమవడం జట్టుకు తీవ్రమైన దెబ్బతీస్తోందని తెలిపాడు.

కేకేఆర్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో కీలక సమయాల్లో ఫీల్డర్లు క్యాచ్‌లను చేజార్చడం ఆటపై తీవ్ర ప్రభావం చూపించిందని కమిన్స్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ల్లో విజయం సాధించాలంటే బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మెరుగుదల అవసరమని, కచ్చితమైన ప్రణాళికతో మిగిలిన మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాలని పేర్కొన్నాడు.

ఈ వరుస పరాజయాల నేపథ్యంలో ఎస్ఆర్‌హెచ్‌లో మార్పులు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకుని రాబోయే మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేయగలరా అనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *