ఆంధ్రప్రదేశ్‌లో వాటర్ టూరిజంను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో నేడు విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ప్రకాశం బ్యారేజి వద్ద టేకాఫ్ తీసుకున్న ఈ సీ ప్లేన్ కృష్ణా నదిలో శ్రీశైలంలో ల్యాండ్ అయ్యింది.
వాటర్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో టూరిజం, ఎయిర్ ఫోర్స్, ఏపీ పోలీస్, ఎస్టీఆర్ఎఫ్ అధికారులు ఈ ట్రయల్ రన్‌ను పర్యవేక్షించారు. సీ ప్లేన్ నీటిపై ప్రయాణిస్తూ శ్రీశైలం జెట్టీ వద్దకు చేరుకుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడం వల్ల టూరిజానికి మరింత ప్రోత్సాహం లభించే అవకాశముంది.
ట్రయల్ రన్ విజయవంతం కావడంతో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు సీ ప్లేన్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. విజయవాడ పున్నమి ఘాట్ నుంచి మొదలు కానున్న ఈ ప్రయాణం ద్వారా రాష్ట్రంలో వాతావరణానికి అనుకూలమైన టూరిజం అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆశిస్తున్నారు.