ఏపీడబ్ల్యూజేఎఫ్ గాజువాక యూనిట్ సర్వ సభ్య సమావేశం గాజువాక శ్రీ కృష్ణ యాదవ కళ్యాణ మండపంలో గురువారం అత్యంత వైభవంగా జరిగింది. టీడీపి రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ముఖ్య అతిధులుగా హాజరైన ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గాజువాక యూనిట్ కు గౌరవ అధ్యక్షుడుగా డి. నారాయణరావు(ఆంధ్ర జ్యోతి), అధ్యక్షుడిగా పితాని సూర్య ప్రసాద్(ఆజాద్), ఉపాధ్యక్షులుగా ఎం. గిరిబాబు( ఆంధ్ర జ్యోతి), టి. రమణారావు( ప్రజాశక్తి) కార్యదర్శిగా ఎన్. నాయుడుబాబు( సుమన్ టివి) ట్రెజరర్ గా జి. రాంబాబు( రేపటి ఉదయం), ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా బద్ధి వరలక్ష్మి శిరీష(ఆంధ్ర ప్రభ), బాలు( ఆజాద్), సహాయ కార్యదర్శులుగా జి. రాజు( గ్రేటర్ న్యూస్), ఎం. డి. సిద్ధిఖ్( మహా టీవీ), బాలు ( sdv) సి హెచ్ సంతోష్ (BRK), కార్య వర్గ సభ్యులుగా గణేష్ (ఐ న్యూస్), సి హెచ్ శ్రీనివాస్ ( విజిట్స్), ఎం. రాజు (ఈటీవీ), ఎం. కనక రాజు, ఎల్లాజీ ( కె ఎన్ ఆర్) సుధాకర్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని జిల్లా యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి నారాయణ్ ప్రకటించారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా కసిరెడ్డి వెంకటరమణ ను నియమిస్తున్నట్లు ఈ సందర్బంగా ప్రకటించారు. యూనిట్ గౌరవ సలహా దారులుగా సీనియర్ జర్నలిస్టులు ఎస్. జగదీష్(ఈనాడు), ఎం. కామేశ్వర రావు, ఎల్ . రాజు ( వార్త) కె. సూర్య ప్రసాద్ లను నియమించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జి . శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ సాంబ శివరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి డి. రవి కుమార్, ఆనంద్, ట్రెజరర్ మూర్తి, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్, కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షలు పుతి వెంకటరెడ్డి సంయుక్త కార్యదర్శి రాజశేఖర్ జగన్నాధం ఏపీ బి జే ఏ సంయుక్త కార్యదర్శి సురేష్,రాజు గాజువాక, మల్కాపురం, పెదగంట్యాడ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు.
గాజువాక యూనిట్ సభ్య సమావేశం విజయవంతం
