ఏలూరు నగరంలో యానిమల్ హస్బండ్రీ అసిస్టెంట్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ ఎం గణేష్ ఎలక్షన్ అధికారిగా వ్యవహరించారు. ఎన్నికల్లో అసోసియేషన్ ప్రెసిడెంట్ గా తమరిష్ గాంధీ, సెక్రటరీగా బిరుదు గడ్డ రాజేష్, కోశాధికారిగా డోలా అశోక్ కుమార్, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎలక్షన్ అధికారి ఎం గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ అసోసియేషన్ ఎన్నికలు సజావుగా జరిగాయని కొత్తగా ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అందరూ ఐక్యమత్యంతో పనిచేసి యూనియన్ సమస్యల పట్ల స్పందించి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
ఏలూరులో యానిమల్ హస్బండ్రీ అసోసియేషన్ ఎన్నికల సఫలత
