పెద్దపల్లి జిల్లాలోని వీరభధ్రీయ కుల బాంధవులకు అందరికీ ఇందిరమ్మ గృహాలు మరియు ఇతరత్రా ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని పెద్దపల్లి జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి కి బుధవారం వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా గుండారం ధర్మారం పెద్దపల్లి జిల్లాలోని వీరభద్రియ కులస్తులకు కుల గణన మరియు బిసి లోన్లు అలాగే తమ పిల్లల చదువుల గురించి ఇందిరమ్మ గృహాల గురించి తమ కులాన్ని పరిగణలోకి తీసుకొని అందజేయాలని వారు ఆ అవినతిపత్రంలో పేర్కొన్నారు. అలాగే పథకాలు వచ్చేలా చూసానని అలాగే ఈ నవంబర్ ఒకటో తేదీన కరీం నగర్ లో బీసీ కమిషనర్ రావడం జరుగుతుందని మీరంతా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా వీరభద్రయ్య జిల్లా నాయకులు మల్యాల వీరయ్య కడారి ఎల్లేష్ కడారి రవి బాణాల వేణు దివిటి తిరుపతి శ్రీనివాస్ మల్యాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ గృహాలు అందించేందుకు వినతిపత్రం సమర్పణ
