రామగుండంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రారంభం

Ramagundam MLA Makkansinh Raj Thakur inaugurated the long-awaited Sub-Registration Office, fulfilling the public’s need for local property services. Ramagundam MLA Makkansinh Raj Thakur inaugurated the long-awaited Sub-Registration Office, fulfilling the public’s need for local property services.

రామగుండం నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక రిజిస్ట్రేషన్ కార్యాలయం ఈరోజుతో నెరవేరిందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. బుధవారం రామగుండం పట్టణం రైల్వే స్టేషన్ ఏరియా పాత ఎంపీపీ కార్యాలయ భవనంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. రామగుండం కార్పొరేషన్ పల్లెలోని ప్రజలు వారి కమర్షియల్ భూములు ఇతర అవసరాల కోసం పెద్దపల్లికి వెళ్లాల్సి వచ్చేదని ఇకనుంచి ఈ కార్యాలయంలోనే ఎలాంటి శ్రమ లేకుండా వారి పనులు పూర్తవుతాయని, క్రయ విక్రయ భూములకు ఈ కార్యాలయం కేంద్ర బిందువుగా ఉంటుందని, ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం పట్టణంలోనే నైజాం సర్కార్యం లో కార్యాలయం ఈ ప్రాంతంలో ఉండేదని తదనంతరం ఎమ్మార్వో ఎంపీడీవో కార్యలయాలు పనిచేసేయని గత కొంతకాలంగా మండల వ్యవస్థ ఫలితంగా పాలకుర్తి మండలాలు రావడంతో ఎంపీడీవో కార్యాలయాలు మరుగున పడ్డాయని గుర్తు చేశారు.

తిరిగి సబ్ రిజిస్టర్ కార్యాలయం పాత ఎంపీడీవో కార్యాలయంలో ప్రారంభించడంతో పూర్వ వైభవం సంతరించుకోబోతుందని అందుకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండంలో 8 00 సామర్ధ్యం గల నూతన విద్యుత్ ప్లాంట్ తెస్తున్నామని సంబంధించిన ప్రక్రియ దగ్గర పడిందని అన్నారు. రామగుండం నియోజవర్గంలో పట్టణాలు పల్లెల్లో ప్రజలకు ప్రజల అభివృద్ధితో పాటు వారి సమస్యల పరిష్కారంలో ప్రతినిత్యం శ్రమిస్తున్నామని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో పనిచేస్తున్నామని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని అన్నారు.రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే ముందు వరసలో ఉంచాలని ప్రయత్నిస్తున్నామని శ్రమిస్తున్నామని అన్నారు.

అయితే గతంలో రామగుండం నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధులు చేసింది ఏమీ లేకపోగా కేవలం ఉనికి కోసం సోషల్ మీడియా ఇతర పద్ధతుల ద్వారా అసత్యం ప్రచారం చేస్తున్నారని వారికి రామగుండం నియోజకవర్గ ప్రజలే సరైన జవాబు చెప్పాలని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్, పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ రిజిస్ట్రేషన్ అండ్ సాంఫ్స్ ఎం రవికుమార్ జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ‌ జిల్లా రిజిస్టర్ బి ప్రవీణ్ కుమార్ రామగుండం రిజిస్టర్ తిరుపతి నాయక్ రామగుండం మేయర్ అనిల్ కుమార్ కార్పొరేటర్లు అధికారులు కాంగ్రెస్ అనుబంధసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *