కుంటుభుక్తవలస గ్రామంలో ప్రత్యేక అధికారి గ్రామ సందర్శన

Under Special Officer Prameela Gandhi’s leadership, officials visited Kuntubhuktavalasa to assess the anganwadi center and school infrastructure. Under Special Officer Prameela Gandhi’s leadership, officials visited Kuntubhuktavalasa to assess the anganwadi center and school infrastructure.

విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటుభుక్తవలస గ్రామంలో గురువారం మండల ప్రత్యేక అధికారి ప్రమీల గాంధీ ఆధ్వర్యంలో గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, పాఠశాలలను సందర్శించారు. అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరుకుందని వెంటనే అద్దె భవనంలోకి మార్చాలని ఆదేశించారు. అదేవిధంగా పాఠశాల వద్ద ఉన్న పాత పాఠశాల భవనాన్ని తొలిగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాను మూర్తి, తహసిల్దార్ శ్రీనివాసరావు, సర్పంచ్ కొ రిపిల్లి బంగారమ్మ, ఎంపీటీసీ చప్ప సూర్యకుమారి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *