రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏలూరు జంగారెడ్డిగూడెం నూజివీడు డిపో నుండి ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఈ సంవత్సరం కూడా పంచారామ క్షేత్రాలైన అమరావతి భీమవరం పాలకొల్లు ద్రాక్షారామం సామర్లకోట లకు ఆదివారం రాత్రికి బయలుదేరి సోమవారం ఈ ఐదు క్షేత్రాలు దర్శించుకుని తిరిగి గమ్యం చేరటం జరుగుతుందని ప్రజా రవాణా అధికారి ఎన్విఆర్ వరప్రసాద్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ నవంబరు 3, 10, 17, 24, తేదీలలో పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వాములు కోసం కొత్త సూపర్ లగ్జరీ అల్ట్రా డీలక్స్ బస్సులు స్వాముల కోరిక మేరకు వారి కోరిన క్షేత్రాలకు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ బి వాణి, ఎకౌంట్స్ ఆఫీసర్ వి నరసింహమూర్తి, పర్సనల్ ఆఫీసర్ పి వేణుగోపాలరావు, PRO కే నరసింహం పాల్గొన్నారు