సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ RG-1 ఏరియా ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ కోయ హర్ష గారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు
GMR సంస్థ ఉచిత శిక్షణ కి హైదరాబాద్ వెళ్తున్న నిరుద్యోగ యువతి, యువకులను బస్సు ఎక్కించి జండా ఊపిన శుభాకాంక్షలు తెలిపిన రాజ్ ఠాకూర్
*నైపుణ్యాలతో మంచి ఉపాధి సాధ్యం…..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
*యువత నైపుణ్య ఉపాధి శిక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
*త్వరలో రామగుండంలో ఐటి, ఏఐ స్కిల్ సెంటర్ల ఏర్పాటు ప్రణాళికలు
*ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ లో స్థానికులకు ఉపాధి లభించేలా చర్యలు
*సింగరేణి ఆర్జి 1 ఆధ్వర్యంలో నిర్వహించిన యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులలో మనకు నైపుణ్యాలు ఉంటేనే మంచి ఉపాధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగుండం లోని సింగరేణి ఆర్జి 1 ఆధ్వర్యంలో నిర్వహించిన యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, యువతకు నైపుణ్య శిక్షణ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని రామగుండంలో ఏర్పాటు చేశామని అన్నారు.
రామగుండంలో ఏర్పాటుచేసిన నైపుణ్య శిక్షణ కేంద్రం ద్వారా యువతకు ఉపాధి లభించేలా అవసరమైన నైపుణ్యాలు అందిస్తున్నామని, ఎల్&టీ, ఐసిఐసి వంటి ప్రముఖ సంస్థల సహకారంతో యువతకు మార్కెట్ లో డిమాండ్ ఉన్న నైపుణ్యాలను శిక్షణ అందిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
యువత నైపుణ్యాలు నేర్చుకునేందుకు ముందుకు రావాలని అన్నారు. వచ్చే రెండు నెలలు అగ్ని వీర్ నోటిఫికేషన్లు కూడా వస్తాయని, ఇందులో పాల్గొనాలి అనుకున్న యువకులకు అవసరమైన శిక్షణ అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.
యువత దగ్గర మంచి నైపుణ్యాలు ఉంటే ఉపాధి లభిస్తుందని, మార్కెట్ లో మనకు మంచి డిమాండ్ ఉంటుందని, నైపుణ్యాలను మనం ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకోవాలని అన్నారు.
రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ , జీఎంఆర్ వరలక్ష్మి ఆధ్వర్యంలో 150 మంది యువకులకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకు ఉపాధి కల్పన పై ప్రత్యేక శ్రద్ధ వహించామని అన్నారు.
60 వేల మంది పైగా యువతకు ప్రభుత్వం ఉద్యోగాల నియామక పత్రాలు అందించిందని, లక్షల మందికి పైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించామని అన్నారు. గతంలోని పేపర్ లీకేజీ సమస్యలను పరిష్కరించి పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు.
మన ప్రాంతంలో చదువుకున్న యువతకు ఉపాధి అందించేందుకు గల అన్ని ప్రయత్నాలు చేస్తామని అన్నారు. గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు కూడా నైపుణ్యాలు లేకపోవడం వల్ల ఉపాధి లేకుండా ఉన్నారని, వీరికి అవసరమైన నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వ తరపున చర్యలు చేపట్టామని అన్నారు.
యువతకు అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ సైతం ఏర్పాటు చేస్తుందని అన్నారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో స్కిల్ అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో జిఎం ఆధ్వర్యంలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఆధ్వర్యంలో రామగుండంలో ఐటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు.
రామగుండం ప్రాంతంలో ఉన్న ఎన్టిపిసి, సింగరేణి, మెడికల్ కాలేజ్, ఆర్.ఎఫ్.సి.ఎల్ లో స్థానికులకు ఉపాధి కల్పించేలా చూడాలని ఎమ్మెల్యే కలెక్టర్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్ల . జి.1 జి యం.లలిత్ కుమార్, రామగుండం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం .రమేష్, ఆర్జి 1 సి.ఎం.ఓ.ఏ.ఐ. అధ్యక్షులు బి మల్లేశం, ఎస్.ఈ.డబ్ల్యూ.ఏ అధ్యక్షులు డి అనిత లలిత్ కుమార్, సంబంధిత అధికారులు, కార్పొరేటర్స్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.