ఐపీఎల్ 2025 సీజన్‌లో ఏప్రిల్ 20న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలవడంతో, కొందరు నెటిజన్లు టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్‌ను సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఒత్తిడికి లోనై ఓడిపోవడం నేపథ్యంలో ఈ విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ ట్రోలింగ్‌పై శ్రేష్ఠ అయ్యర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఘాటుగా స్పందించారు. “మేము మైదానంలో ఉండోచ్, లేక దూరం నుంచైనా మా జట్టుకు మద్దతు అందిస్తాం. కానీ ఆ మద్దతుకు నిందించడం బాధాకరం. కుటుంబాన్ని లక్ష్యంగా తీసుకోవడం నిజంగా సిగ్గుచేటు. జట్టుపై ప్రేమ చూపించడమే మా ఉద్దేశం” అని పేర్కొన్నారు.
శ్రేష్ఠ “నేను ఎన్నో మ్యాచ్‌లకు హాజరయ్యాను, చాలా విజయాలను ప్రత్యక్షంగా చూసాను. కానీ ఓ మ్యాచ్‌లో ఓడిపోయారని ట్రోలింగ్ చేయడం నీచమైన చర్య. స్క్రీన్ వెనుక దాక్కుని ఎవరినైనా దూషించడం అంటే క్షమించరానిది” అని అన్నారు. ఆమె పోస్ట్‌కు సోషల్ మీడియాలో మద్దతుగా కామెంట్లు వెల్లువెత్తాయి.
అలాగే, విరాట్ కోహ్లీ అభిమానులే శ్రేష్ఠను టార్గెట్ చేశారంటూ ఒక నెటిజన్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఇదివరకు శుభ్‌మన్ గిల్ సోదరి, రోహిత్ శర్మ కుమార్తె, కేఎల్ రాహుల్ భార్య కూడా ఇలాంటి ట్రోలింగ్‌కు గురయ్యారన్న విమర్శలు వెలువడ్డాయి. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ధృవీకరణ లేదు.
