పెళ్లి చేసుకుని నగలు, డబ్బుతో పరార్ అయిన యువతి

Woman involved in matrimony scam escapes with gold and cash in Warangal Woman involved in matrimony scam escapes with gold and cash in Warangal

Matrimony Fraud Case: పెళ్లి చేసుకుని నగలు, డబ్బుతో పరార్ అయిన యువతి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో పెళ్లి పేరుతో పెద్ద మోసం బయటపడింది. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా కుదిరిన సంబంధంపై నమ్మకం ఉంచిన వరుడు, విజయవాడకు చెందిన యువతితో వివాహం చేసుకున్నాడు.

అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజులకే, రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారంతో ఆ యువతి పరార్ అయింది. యువతి తల్లిదండ్రులు, బంధువులంతా ఫేక్‌గా వ్యవహరించినట్టు తరువాత తెలిసి వరుడు కుటుంబం షాక్‌కు గురైంది.

ALSO READ:నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం | CJI Surya Kant Oath


దర్యాప్తులో ఆ యువతి ఇదే విధంగా గతంలో మరో ఇద్దరు యువకులను కూడా పెళ్లి పేరుతో మోసం చేసినట్లు బయటపడింది. మ్యాట్రిమోనీ సైట్‌లలో ఫేక్ ప్రొఫైళ్లు సృష్టించి విశ్వాసం సంపాదించడం, తర్వాత పెళ్లి నిర్వహించి నగలు–డబ్బు తీసుకుని పరార్ అవడం ఆమె మోసపూరిత పద్ధతి అని పోలీసులు గుర్తించారు.

బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *