ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లో వరస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజులు వ్యవధిలోనే ఐదు ప్రాంతాల్లో చోరీలు జరిగాయి పెనుబల్లి మండలం మండలపాడులో లక్ష్మణరావు అనే వ్యక్తి ఇంట్లో నగదు బంగారం, చోరీకి గురి అయ్యాయి. 150 గ్రాములు బంగారం, మూడు లక్షల 80 వేల రూపాయలు నగదు దొంగల అభయరించారు. అదేవిధంగా లంక సాగర్ లో హోటల్ కౌంటర్ పగలగొట్టి 20,000 నగదు దోసకు పోయారు.లింగగూడెం గ్రామంలో చీకటి రాజా అనే వ్యక్తి ఇంట్లో 96 గ్రాములు బంగారం ఎత్తుకెళ్లారు. మండల పరిధిలోఇలా వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ సంఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లోస్ టీం లతో దర్యాప్తు వేగవంతం చేశారు.
ఖమ్మం జిల్లాలో వరస దొంగతనాలు కలకలం
