సచివాలయానికి వస్తున్న ఉద్యోగస్తులు ఏ పని చేస్తున్నారో ఏంటో తెలియకుండా మాకు అర్థం కావట్లేదని మండిపడిన సర్పంచులు అవసరమైతే సచివాలయ ఉద్యోగాల్ని గ్రామపంచాయతీ లోని విలీనం చేయాలని కూటమి ప్రభుత్వం అధికారుల్లో వచ్చిన వెంటనే అదే పని చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం వెంటనే ఆ పని చేయాలని సర్పంచులు ప్రభుత్వాన్ని కోరారు అదేవిధంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేసి వారి యొక్క సమస్యలను వెంటనే తీర్చాలని కోరారు.. కార్యక్రమంలో అడబాల తాత కాపు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒరిగేది ఏమీ లేదని
జగన్ ప్రభుత్వం వారిని ఎందుకు ఉపయోగించారో మాకు ఇప్పుడు వరకు అర్థం కావట్లేదని మండిపడ్డారు… కార్యక్రమంలో పెద్దిరెడ్డి రాము, నాగాబత్తులు శాంతకుమారి, రమణకుమారి, జె సావిత్రి, కరాటం ప్రసన్నకుమార్, గంగుముళ్ళ ఏసుబాబు, పందిరి విజయ శ్రీను, సలాది బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు.
సచివాలయ ఉద్యోగాల విలీనం చేయాలనే సర్పంచుల విజ్ఞప్తి
