కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండలం గ్రామ నివాసి అయిన షేక్ సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ… గత 26 సంవత్సరాలు ఆర్మీలో విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యాను దేశ సేవ చేసినందుకు ప్రభుత్వము నా సేవలు గుర్తించి పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలోని సర్వేనెంబర్ 227/2 ఖాతా నెంబర్ 1809 లో 4 ఎకరాల 40 సెంట్లు భూమిని ప్రభుత్వం నాకు ఇవ్వడం జరిగింది. మా భూమిని నేను చేసుకోనుచుంటే రంగసముద్ర పంచాయతీ ఇల్లా చెన్నారెడ్డి అనేవారు నా మీదకు దాడి చేయడం జరిగింది. దాని కోసమై స్థానిక సీఐ మరియు ఎమ్మార్వో మరియు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లి కలెక్టర్ ద్వారా
లెటర్ తీసుకొని వచ్చి చూపించినా కూడా స్పందించని రెవిన్నే అధికారులు కోర్టు ద్వారా కూడా లెటర్ తెచ్చి ఇచ్చినా కూడా పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు. ఇలా చెన్నారెడ్డి వారి దగ్గర ఎటువంటి ఆధారాలు లేకపోయినా కూడా అన్ని ఆధారాలు ఉన్న నాపైన దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. ఆర్మీలో నా కాలు విరిగింది. ఉద్యోగ అవకాశాలు రావు ప్రభుత్వ ఇచ్చిన భూమి చేసుకొని బ్రతకడానికి దయవుంచి నా భూమి నాకు కేటాయించి నాకు న్యాయం చేయాలని కోరుచున్నాను. ఎమ్మార్వో గారికి మళ్లీ విన్నవించుకున్న గా విచారణ చేపట్టి పై అధికారులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసం ఒక కలెక్టర్ మరియు కోర్టు ఇచ్చిన ఆర్డర్ ను కూడా పరిశీలించి న్యాయం చేయాలని ఆయన అన్నారు.
ప్రభుత్వ భూమి సమస్యపై రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి న్యాయం కోరుతున్నాడు
