ఎమ్మార్వో ఆఫీస్ రోడ్ ఎదురుగా 5 రూపాయలకే అన్నం పెట్టె అన్నా క్యాంటీన్ లను పున ప్రారంభించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలమంచిలిలో నియోజకవర్గంలో నిరుపేదల ఆకలి కస్టాలు తీరనున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ,డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదల ఆకలిని తీర్చడానికి అన్నా క్యాంటీన్ లను తిరిగి ప్రారంభించారని పేర్కొన్నారు. ఇక నుండి ఎలమంచిలి పట్టణంలో యాచకులు, నిరుపేద విద్యార్థులు, రైతులకు కేవలం 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మద్యానం మరియు రాత్రి కడుపునిండా భోజనం లభిస్తుందని పేర్కొన్నారు. ఎలమంచిలి నియోజవర్గం పల్లెల్లో ఉండే నిరుపేద విద్యార్థులు, కోచింగ్ తీసుకునే నిరుద్యోగులు, వ్యవసాయ పనులు నిమిత్తం పట్టణానికి వచ్చే రైతులు ఇక నుండి వందల రూపాయలు చెల్లించి భోజనం చేసే అవసరం లేదని కేవలం 5 రూపాయలకే రుచికరమైన భోజనం అన్నా క్యాంటీన్ ద్వారా అందిస్తున్నందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ , ఎలమంచిలి మున్సిపాలిటీ చైర్ పర్సన్ పిల్ల రామకుమారి పేర్కొన్నారు. అలాగే అన్నా క్యాంటీన్ పునః ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా గౌ శ్రీ శాసన సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు , హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ,
పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ బొత్స సత్యనారాయణ , పొంగురు నారాయణ, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రారంభించినా అన్నా క్యాంటీన్ లో నిరుపేదలతో కలిసి అల్పాహారం తీసుకొని ఆహార నాణ్యత, రుచిని పరిశీలించడం జరిగినది.
ఎలమంచిలిలో 5 రూపాయల అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం
