ఇటీవలి కాలంలో 20, 25 ఏళ్ల వయస్సులోనే తెల్ల జుట్టు రావడం మొదలైంది. ఈ సమస్య పురుషులతోపాటు మహిళల్లోనూ ఎక్కువగానే కనిపిస్తోంది. కొన్ని కారకాలు మన జుట్టు తెల్లబడడానికి కారణం అవుతుంటాయి. వైద్య నిపుణులు చిన్న వయస్సులో తెల్ల జుట్టు రావడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
వారసత్వం ఒక ప్రధాన కారణం. మీరు చిన్న వయసులో తెల్ల జుట్టు చూసినా, మీ కుటుంబంలో పూర్వీకులు కూడా అలాంటి సమస్యను ఎదుర్కొన్నట్లయితే, జెనెటికల్ గా ఇది మరింత త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, ఈ జుట్టు తెల్లపడటాన్ని ఆలస్యం చేయడానికి, కొన్ని జాగ్రత్తలతో ముందుగానే ప్రణాళికలు రూపొందించుకోవచ్చు.
శరీరంలో యాక్సిడేటివ్ స్ట్రెస్ కూడా ప్రధాన కారణం. ఎండ, కాలుష్యం, ధూళి, దుమ్ము వంటి వాటి వల్ల శరీరంలో యాక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి, జుట్టు త్వరగా తెల్లబడుతుంది. అలాగే, విటమిన్ బీ 12, ఐరన్, కాపర్, జింక్ వంటి పోషకాల యొక్క లోపం కూడా జుట్టు తెల్లపడటానికి దారితీస్తుంది. ఈ విటమిన్ల లోపం వల్ల, మెలనిన్ ఉత్పత్తి సరిగ్గా జరగకుండా జుట్టు తెల్లగా మారిపోతుంది.
హార్మోనల్ సమస్యలు, ముఖ్యంగా మహిళల్లో యుక్త వయస్సు, గర్భం దాల్చడం, మోనోపాజ్ దశలు మొదలైనప్పుడు హార్మోన్లలో మార్పు వస్తుంది. ఈ హార్మోన్లు సరిగా లేకపోతే, తెల్ల జుట్టు రావడమే కాకుండా, తదనంతరం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిళ్లు, అధిక ధూమపానం మరియు విటిలిగో వంటి సమస్యలు కూడా జుట్టు తెల్లపడటానికి ప్రధాన కారణాలుగా భావించవచ్చు.