నర్సీపట్నంలో శ్రీరామ టెక్స్టైల్స్ యాజమాని రాము తన మానవత్వం, సేవా గుణంతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. అనాధలు, వికలాంగులు, పేద ప్రజలపై రామునికి విపరీతమైన ప్రేమ ఉంది. పేదలు ఏం అడిగినా, తక్షణమే సహాయం చేసే ఈ మహానుభావుడు ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీని ప్రత్యేకంగా పేద ప్రజల కోసం మలచుకుంటాడు.
ఈ ఏడాది కూడా రాము సుమారు 3,000 మంది పేదలకు బట్టలు, నగదు అందజేశాడు. ఈ కార్యక్రమంలో భాగంగా తన షాపు వద్ద వికలాంగులకు బట్టలతో పాటు ఒకరికీ రూ.10,000 నగదు ఇచ్చాడు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో రోగులకు వీల్ చైర్స్ అందజేయడం కూడా రాముని నిస్వార్థ సేవలో ఒక భాగం. ఈ సేవా కార్యక్రమాలు జరగడం ద్వారా రాముని ఆనందం మరింత పెరిగింది.
రాము మీడియాతో మాట్లాడుతూ, “ప్రతి సంవత్సరం పేదలకు బట్టలు పంపిణీ చేయడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. హనుమాన్ జయంతి రోజున కూడా పేదలకు అన్నసంతర్పణ, ఉచిత బట్టలు పంపిణీ చేస్తాను. నేను పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నా సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు ఇచ్చి ఆనందం పొందడం నా ధ్యేయం,” అని చెప్పాడు.
రాముని సేవలతో నర్సీపట్నం ప్రాంత ప్రజలు మురిసిపోతున్నారు. రాముని సేవా గుణం ఇతరులకు స్ఫూర్తి నింపుతోంది. ఆయన మరింత మంది పేద ప్రజల జీవితాలను వెలిగించేందుకు తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు.