రంపచోడవరం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన సద స్సులు నిర్వహించడం అభినందనీయమని ఐటీడీఏ పీవో సింహాచలం అన్నారు. సీఐడీ రాజమహేంద్రవరం ఏఎస్పీ అస్మ ఫర్వీన్ ఆధ్వర్యంలో ఐటీడీఏ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పీవో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలంతా ఈ చట్టం గురించి తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. సబ్ కలెక్టర్ కల్పశ్రీ మాట్లాడుతూ షెడ్యుల్ కులాల వారికి ప్రభుత్వం చట్టాలను అమలు చేస్తోందని చెప్పారు. సమాజంలో జరుగుతున్న నేరాలు, వాటి నుంచి ఎలా రక్షణ పొంద వచ్చో సీఐడీ ఏఎస్పీ అస్మ ఫర్వీన్ అవగా హన కల్పించారు. డీఎస్పీ ప్రశాంత్, గిరి జన సంక్షేమ శాఖ డీడీ విజయశాంతి, విశ్రాంత పీపీ గోపాలరావు, ఆదివాసీ నేతలు తెల్లం శేఖర్, కె.రామన్నదొర, సీఐలు రవికుమార్, గోపాలకృష్ణ, సన్యాసి నాయుడు, నరసింహమూర్తి పాల్గొన్నారు.
రంపచోడవరం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సు
