పాకిస్థాన్‌తో రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల మూసివేత

A meeting was held in Jaitavaram village led by Sarpanch Satyavati to form child protection committees and discuss prevention of child marriages and women's safety. A meeting was held in Jaitavaram village led by Sarpanch Satyavati to form child protection committees and discuss prevention of child marriages and women's safety.

భారతదేశం పాక్‌తో సరిహద్దుల్లో ఉత్కంఠత భరితమైన పరిస్థితుల్లో ఉన్నది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆపరేషన్ సిందూర్‌ను అమలు చేసింది. దాంతో, పాకిస్థాన్‌, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ మీద క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ దాడికి పాకిస్థాన్ ఎలా స్పందిస్తుందనే సందేహాలు సృష్టించాయి. పాక్ నుంచి ఎలాంటి దాడులకు ఎదుర్కొనటానికి భారత త్రివిధ దళాలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాలు అత్యంత అప్రమత్తమయ్యాయి.

రాజస్థాన్‌ 1037 కిలోమీటర్ల పొడవైన పాకిస్థాన్ సరిహద్దును పూర్తిగా మూసివేశారు. భద్రతా బలగాలకు అనుమానాస్పద వ్యక్తుల్ని స్పాట్‌లోనే కాల్చివేసే ఆదేశాలు జారీ చేశారు. ఇక, పంజాబ్‌లో కూడా పోలీసుల సెలవులు రద్దు చేయడంతో పాటు, బహిరంగ ప్రదేశాలలో ప్రజలు గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసివేయబడినట్లు సమాచారం. ప్రజల రవాణా, భద్రతపై పెద్ద స్కీమ్‌ అమలు చేశారు.

భారత వైమానిక దళం ఇప్పటికే అప్రమత్తమైంది. జోధ్‌పూర్‌, కిషన్‌గఢ్‌, బికనీర్‌లో విమాన రాకపోకలపై నిషేధం విధించడంతో పాటు, యాంటీ డ్రోన్ వ్యవస్థలతో క్షిపణి రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. సుఖోయ్-30 జెట్‌లు గంగానగర్ నుండి రాణా ఆఫ్ కచ్ వరకు ఎయిర్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాయి.

ఉద్రిక్తత నేపథ్యంలో, సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జైసల్మేర్‌, జోధ్‌పూర్‌ జిల్లాలలో అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు లైట్లు ఆర్పివేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ చర్యలు శత్రుదేశం వైమానిక దాడులను నివారించడానికి తీసుకున్న చర్యలు.

ఈ కాలంలో పాకిస్థాన్‌ స్పందనపై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ భారత క్షిపణి దాడులను ‘బాధ్యతాయుత దాడులు’ అని అభివర్ణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *