సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి క్లబ్ గజ్వేల్- ప్రజ్ఞపూర్ ప్రెసిడెంట్ జగయ్యగారి శేఖర్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,అనంతరం, అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించి, కస్తూరిబా విద్యాలయంలో సుమారు ఐదు వందల మంది విద్యార్థినులకు నోటు బుక్కులు పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్ గవర్నర్ భానురి నర్సింలు, రీజియన్ చైర్మన్ మహంకాళ శ్రీనివాస్, జోన్ చైర్మన్ తోడుపునూరి కృష్ణ వేణి, డిస్టిక్ ఆఫీసర్ కొండా శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి క్లబ్ సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పూజలు మరియు విద్యార్థులకు నోటు బుక్కుల పంపిణీ
