ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు CITU,DYFI,KVPS, ఐద్వా మహిళా సంఘాల ఆధ్వర్యంలో
ఈరోజు ఉదయం బద్వేల్ పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్డు నందు ఉన్న గాంధీజీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కే శ్రీనివాసులు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని లు మాట్లాడుతూ….. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పైన కడప ఉక్కు పైన తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది అన్నారు.
నాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించి సాధించుకున్న విశాఖ ఉక్కు ను నేడు నష్టాలు వస్తున్నయన్న సాకుతో కార్పొరేటు శక్తులకు అమ్మే ప్రయత్నం వంటి కుటిల ప్రయత్నాలు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది అన్నారు.
నాడు ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న విశాఖ ఉక్కు నేడు ప్రాణాలర్పించైనా ప్రైవేటీకరణ అడ్డుకుంటామని హెచ్చరించారు. అలాగే విభజన హామీలను చట్టబద్ధంగా రాసుకున్న కడప ఉక్కుని సైతం కేంద్రం పక్షపాత ధోరణితో చూస్తూ నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో కరువుతో ఒకవైపు అల్లాడుతుంటే వలసలతో అల్లడిపోతుంటే పాలకులకు కనపడటం లేదన్నారు. వలసలకు నివారణకు కడప ఉక్కు పరిశ్రమే ఏకైక మార్గం అన్నారు. ఇక్కడ చదువుకున్న యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు దేశాలకు వలసలు పోతున్నారు అన్నారు. అదే ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయితే చదువుకున్న యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి లభిస్తుంది అన్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని లేకుంటే రాబోవు రోజులలో విద్యార్థులు యువకులతో పెద్ద ఎత్తున పోరాటాలకు నాంది పలుకుతామని వారు హెచ్చరించారు