20 ఏళ్ళ తరువాత తెరపైకి నటి ప్రత్యుష కేసు.సంచలనానికి గురిచేసిన సినీ నటి ప్రత్యూష మృతి కేసు (Actor Pratyusha Death Case) మరో కీలక దశకు చేరుకుంది. రెండు దశాబ్దాలుగా నడుస్తున్న ఈ కేసులో, హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన అప్పీల్‌తో పాటు, నిందితుడికి విధించిన శిక్షను పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది.
ALSO READ:Rajinikanth Honor:హిందుస్థాన్ టైమ్స్ ఫ్రంట్ పేజీలో తలైవా
జస్టిస్ రాజేశ్ బిందల్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం రెండు పక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. ప్రత్యూష మృతి కేసు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశమై, నిందితుడి పాత్ర, ఘటన పరిస్థితులు, దర్యాప్తు అంశాలు పెద్దగా హాట్‌టాపిక్ అయ్యాయి.
ఇప్పుడు సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిన ఈ తీర్పు, కేసు భవిష్యత్తును నిర్ణయించనున్నదిగా న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
