సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రసన్న హరికృష్ణ సోమవారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ దాదాపు రెండు దశాబ్దాల తన ఉద్యోగ ప్రస్థానం లో విద్యార్థుల భవితకు తన వంతు కృషి చేయడం జరిగిందని త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేయడం జరిగిందని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రులు రాబోయే ఎన్నికల్లో నాకు ఓటు వేసి అండగా నిలవాలని కోరారు
ప్రసన్న హరికృష్ణ ఉద్యోగానికి రాజీనామా
