అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 పోలింగ్‌కు సమయం ఆసన్నమైంది. రేపు (మంగళవారం) అమెరికన్లు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. అందుకే ప్రపంచం దృష్టి అగ్రరాజ్యం ఎన్నికలపై ఉంది. ఓటింగ్‌కు ఒక్క రోజు ముందు, ప్రముఖ ‘అట్లాస్‌ఇంటెల్’ పోల్ సర్వే డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గు ఉందని తెలిపింది. ప్రధానంగా స్వింగ్ రాష్ట్రాలలో ట్రంప్‌కు ఆదరణ ఉండటం విశేషం.
సర్వే ప్రకారం, రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు 49 శాతం మంది ఓటు వేస్తామని తెలిపారు. హారిస్ కంటే ట్రంప్‌కు 1.8 శాతం ఓట్ల ఆధిక్యం కనిపించడం ముఖ్యమైన అంశం. నవంబర్ 1, 2 తేదీలలో నిర్వహించిన ఈ సర్వేలో 2,500 మంది ఓటర్ల అభిప్రాయాన్ని సేకరించగా, ఇందులో ఎక్కువగా మహిళలనే సేకరించారు.
స్వింగ్ రాష్ట్రాలపై పోల్ సర్వేలు ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా ఫలితాలు రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారుతాయని భావిస్తున్నారు. అరిజోనా, జార్జియా, మిషిగాన్, నెవడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ వంటి రాష్ట్రాలలో ట్రంప్‌కు ఆదరణ కనిపిస్తోంది. ఉదాహరణకు, అరిజోనాలో ట్రంప్‌కు 51.9 శాతం, కమలకు 45.1 శాతం ఓట్లు పడుతాయని విశ్లేషించారు.