పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బుట్టాయగూడెం మండల కేంద్రంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. MLC ఎన్నికల ప్రచార ప్రణాళికపై నేతలతో చర్చించి, తర్వాత విద్యా రోహిణి డిజిటల్ స్కూల్‌లో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలవరం టిడిపి కన్వీనర్ బోరగం శ్రీనివాసులు, MLC అబ్జర్వర్ పుచ్చకాయల విజయ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వం గ్రాడ్యుయేట్లకు ఇబ్బందులు సృష్టించిందని, CPS రద్దు లాంటి హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. NDA కూటమి ప్రభుత్వం గత ఆరు నెలల్లో అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తోందని చెప్పారు. గ్రాడ్యుయేట్లు ఈ నిజాలను గుర్తించి, టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌కు మద్దతు తెలపాలని కోరారు.
ఈ ఎన్నికలు కీలకమని, ఉమ్మడి గోదావరి జిల్లాల అభివృద్ధికి తమ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత గ్రాడ్యుయేట్లపై ఉందన్నారు. మొదటి నెంబర్ అభ్యర్థిగా రాజశేఖర్ పేరు ఉండేలా ఓటు వేయాలని, అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. విద్యావేత్తలు, యువత తమ భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు, టీడీపీ-జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలని, ఇంటింటా వెళ్లి అభ్యర్థికి మద్దతు కోరాలని నేతలు సూచించారు. MLC ఎన్నికల్లో టీడీపీ కూటమికి భారీ విజయాన్ని అందించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు.