PM Modi Puttaparthi Visit: సత్యసాయి శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ

Prime Minister Modi visit to Puttaparthi for Sri Sathya Sai Centenary celebrations PM Modi to attend Women’s Day event at Hill View Stadium as part of Sri Sathya Sai Centenary celebrations

శ్రీ సత్యసాయి(Puttaparthi Sri Sathya Sai) శత జయంతి వేడుకలు పుట్టపర్తిలో ప్రారంభం కానున్నాయి. రేపు రథోత్సవంతో అధికారిక కార్యక్రమాలు మొదలవుతాయి. ఎల్లుండి పుట్టపర్తి హిల్వ్యూ స్టేడియంలో నిర్వహించే మహిళా దినోత్సవ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు.

ఈ వేడుకలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు హాజరవుతుండటంతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ALSO READ:India Ricin Terror Threat: ఆముదం గింజలతో ఉగ్రవాదుల ఘోర ప్రయోగం

రోజువారీ కార్యక్రమాల ప్రకారం—20, 21 తేదీల్లో యువజన సదస్సులు, 22న సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవం, 23న అధికారిక శతజయంతి మహోత్సవం జరగనుంది. పుట్టపర్తిలోని సత్యసాయి సంస్థలు ఈ వేడుకలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. భక్తులు, విద్యార్థులు, సేవాసంస్థలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశంతో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *