ఇండిగో విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రయాణికులందరూ తమ సీట్లలో కూర్చున్నారు. ఈ సందర్భంలో పైలట్ తన ప్రత్యేక ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘‘మీ ప్రయాణ భాగస్వామిగా ఇండిగోను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు’’ అని మొదలైన ప్రకటన, ‘‘నా భార్య విభా శర్మ ఈరోజు నాతో తొలిసారిగా విమాన ప్రయాణం చేస్తోంది’’ అంటూ భావోద్వేగంతో కొనసాగింది.
ఆమె తన జీవితంలో ఎంతటి మద్దతుగా నిలిచిందో వివరించాడామె పైలట్. ‘‘కష్టసుఖాల్లో నువ్వు నా పక్కన బలమైన పునాది లాగా ఉన్నావు. నీకు నా కృతజ్ఞతలు’’ అంటూ చెప్పినప్పుడు, భార్యతో పాటు ప్రయాణికుల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ ప్రకటనతో విమానంలో అందరూ భావోద్వేగంతో స్పందించారు.
ఈ అద్భుతమైన సందర్భానికి సంబంధించిన వీడియోను విభా శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘‘నా భర్త చేసిన ప్రకటనతో నేను ఆశ్చర్యపోయా. మళ్లీ ప్రేమలో పడ్డానని అనిపిస్తోంది’’ అని ఆమె పేర్కొంది. దంపతులు తీసుకున్న ఫొటోలను కూడా షేర్ చేసింది, కానీ కొద్దిసేపటికే ఆ వీడియోను తొలగించింది.
నెటిజన్లు ఈ ఘటనపై గొప్పగా స్పందించారు. ‘‘పిల్లర్ లా ఉండే భర్త దొరకడం ఆమె అదృష్టం’’ అంటూ ప్రశంసలు కురిపించారు. ‘‘ఇలా ప్రేమను వ్యక్తపరచగలగడం నిజంగా గొప్ప విషయం’’ అని పలువురు వ్యాఖ్యానించారు. ఈ జంటకు జీవితాంతం సంతోషం కలగాలని అందరూ కోరుకుంటున్నారు.