పీలేరు అటవీశాఖ అధికారి బి.ప్రియాంక తెలిపారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్ను అరెస్టు చేసి, ఎర్రచందనం దుంగలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని సోమవారం వెల్లడించారు. గూండా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు ఆదివారం రాత్రి నుంచి పీలేరు మండలం జాండ్ల గ్రామంలో వాహనాల తనిఖీ చేపట్టారు.
సోమవారం ఉదయం తలుపుల గ్రామం నుంచి KA09 M 7180 నంబరు గల మారుతి కారు పీలేరు వైపు వేగంగా ప్రయాణిస్తుండగా, దానిని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులు దాన్ని వెంబడించి గూడరేవుపల్లి వద్ద అడ్డగించారు. కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతను తమిళనాడు తిరువన్నామలై జిల్లా వాసి ఎ.విజయ్ కాంత్(28) గా గుర్తించారు.
వాహనాన్ని తనిఖీ చేయగా 36 కిలోల బరువున్న మూడు ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయి. వెంటనే స్మగ్లర్ను అదుపులోకి తీసుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.
ఈ దాడిలో పీలేరు ఫారెస్ట్ సెక్షన్ అధికారి సబిహా సుల్తానా, బొంత కనుమ బేస్ క్యాంప్ ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు. పట్టుబడ్డ స్మగ్లరును తిరుపతిలోని ఎర్రచందనం ప్రత్యేక కోర్టులో హాజరు పరిచినట్లు అధికారులు వెల్లడించారు.
