గోదావరి నదిలో పాపికొండల విహారయాత్ర సందడి

Over 600 tourists enjoyed a vibrant boat journey on the Godavari River to Papikondalu. The scenic beauty and cultural sites added charm to the trip. Over 600 tourists enjoyed a vibrant boat journey on the Godavari River to Papikondalu. The scenic beauty and cultural sites added charm to the trip.

గోదావరి నదిలో పర్యాటక బోట్లు సందడి చేశాయి. పాపికొండల విహారయాత్రకు శనివారం భారీగా పర్యాటకులు వెళ్లారు.ఎస్‌ఐ షరీఫ్‌ ఆధ్వర్యంలో బోట్లు పరిశీలన చేయడంతో పాటు, పర్యాటకులకు సూచనలు ఇచ్చారు. దేవీపట్నం నుంచి పాపికొండల విహారయాత్రకు. పది పర్యాటక బోట్లలో 604 మంది పర్యాటకులు వెళ్ళగా, పర్యాటకులతో గోదావరి నదిలో విహారయాత్ర సందడిగా సాగింది. ఉదయం 9 గంటలకు బయలుదేరిన పర్యాటక బోట్లు గోదావరి నది చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాలను తిలకిస్తూ, మధ్యాహ్నం సమయానికి పాపికొండలకు చేరుకున్నారు. అక్కడ పేరంటాలపల్లి వద్ద శివాలయాన్ని దర్శించుకుని, పర్యాటక ప్రాంతాలను తిలకించి తిరిగి ప్రయాణమయ్యారు. సాయంత్రం ఐదు గంటలకు గండి పోచమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్న బోట్‌ పాయింట్‌ వద్దకు చేరుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *