కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం లోని ఇందిరమ్మ కాలనీ మరియు వావిళ్ళ గ్రామాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు, ఈ సందర్భంగా విడవలూరు ఇందిరమ్మ కాలనీ నందు 10 లక్షలతో అలాగే వావిళ్ళ గ్రామంలో 20 లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మీడియాతో మాట్లాడారు…
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెముకుల సీనయ్య ,బెజవాడ వంశీకృష్ణారెడ్డి, వావిళ్ళ సర్పంచ్ ఏటూరు రాజేశ్వరి ,హరి రెడ్డి ,శివ గౌడ్ ,జనసేన నాయకులు కమతం శ్రీనాథ్ యాదవ్ ,బీజేపీ, టీడీపీ ,జనసేన నాయకులు కార్యకర్తలు మండల అధికారులు పాల్గొన్నారు.