నాతవరం మండల కేంద్రంలో ఫారెస్ట్ గ్రౌండ్ దగ్గర 11 వ తేదీ జనవరి 2025 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేద పండితుల సమక్షంలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం చెయ్యడం జరుగుతుందని తెలుగు దేశం పార్టీ మాజీ జడ్పిటిసి. కరక సత్యనారాయణ అన్నారు.
శనివారం నాతవరం గ్రామంలో గల శ్రీ శక్తి పంచాయతన ఆలయం వద్ద తెలుగు దేశం పార్టీ నాయకులతో కలిసి శ్రీనివాస కళ్యాణం పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణం లో పాల్గొన దలచిన భక్తులు ముందుగా కమిటీ వారిని సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలెను.
ఈ శ్రీనివాస కళ్యాణం కార్యక్రమం శ్రీ శక్తి పంచాయతన ఆలయ ధర్మకర్త ఎన్నారై శెట్టి సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.