అచ్యుతాపురం ఎస్ ఈ జెడ్ లో ఈ ఎస్ ఐ హాస్పిటల్ భూమి పూజ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాస్ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాజీ ఎంపీ పప్పుల చలపతిరావు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ లు ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభించారు. రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 7 హాస్పిటల్స్ వర్చువల్ పద్ధతిలో ప్రధాన నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగిందని అన్నారు.
అచ్యుతాపురం స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎస్ ఈ జెడ్ ప్రాంతంలో 30 పడకల ఈ ఎస్ ఐ హాస్పిటల్ తో పాటు 16 నివాస గృహాలు పనులకు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగిందని ఈ నిర్మాణ పనులు సిపిడబ్ల్యూఎస్ అప్పగించడం జరిగిందని సుమారు 62.21 కోట్లు తో హాస్పిటల్ పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం కార్మిక శాఖ పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఒక అభివృద్ధి పను కూడా చేపట్టలేదని ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ నిర్మించడం జరుగుతుందని గతంలోని ఈ హాస్పిటల్ నిర్మించి ఉంటే ఇక్కడ ఉన్న కార్మికులకి లబ్ది కలిగేదని అన్నారు.