Anam Narayana Reddy: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి టీటీడీ(TTD) వ్యవహారాలపై చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో వేడి చర్చకు దారి తీసాయి. గత ప్రభుత్వ పాలనలో టీటీడీలో జరిగిన వ్యవహారాలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశాయన్న ఆరోపణలు ఆయన చేశారు.
పరకామణి హుండీ లెక్కింపులో జరిగిన దోపిడీని కప్పిపుచ్చారని, భక్తులు నమ్మే లడ్డూ ప్రసాదం వరకు అవకతవకలు జరిగాయన్నది ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి కార్యక్రమంలో “మాఫియా రాజ్యం” నడిచిందని విమర్శించారు.
ALSO READ:Shamshabad Airport bomb threat | కోవైట్, లండన్ ఫ్లైట్లకు బాంబు బెదిరింపు కలకలం
లోక్ అదాలత్ వివాదాల్లో అనవసర రాజీలు లాభదాయక ప్రయోజనాల కోసం జరిగాయన్న ఆరోపణలు కూడా ఆయన చేశారు. పోలీసు వ్యవస్థను వినియోగించి వ్యక్తుల ఆస్తులు దోపిడీ చేశారని అన్నారు.
ఆస్తులు అక్రమంగా పెరిగిన విషయాన్ని ప్రశ్నిస్తూ గత పాలనపై విమర్శలు చేశారు. నెయ్యి తయారీపై చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వైరల్ అయ్యాయి.
టీటీడీ చైర్మన్ పదవిలో జరిగిన నియామకాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తిన ఆనం, గత పాలనలో వ్యవస్థలు దెబ్బతిన్నాయని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం టీటీడీ పరిపాలనలో జరిగిన అన్యాయాలను వెలికితీసి, భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి దృష్టి పెట్టిందని మంత్రి స్పష్టం చేశారు.
