అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా సిద్ధం చేసిన సెట్లో వీరి మంగళస్నానాలు జరగడంతో ఈ వేడుకలు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీరి పెళ్లి కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ ఏర్పాట్లు చేశారు.
డిసెంబర్ 4న రాత్రి 8.13 గంటలకు వీరి వివాహం జరగనుంది. బ్రాహ్మణ సంప్రదాయ ప్రకారం దాదాపు 8 గంటల పాటు వివాహ కార్యక్రమాలు జరుగుతాయని సినీ వర్గాల సమాచారం. ఈ ప్రత్యేక వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు.
సెట్లో పెళ్లి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మంగళస్నానాలు, హల్దీ కార్యక్రమాలు సంప్రదాయ రీతిలో జరిగింది. ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
నాగ చైతన్య, శోభితా వివాహం టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వారి వివాహ వేడుకల వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలు టాలీవుడ్ ప్రముఖులకు మరుపురాని వేడుకగా నిలవనున్నాయి.