రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నూరుశాతం కృషి చేసిన కాపులకు సంపూర్ణ న్యాయం చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి… జాతీయ కాపు సంఘం అధ్యక్షులు కర్ణ మురళీకృష్ణ నాయుడు..
ముమ్మిడివరం మండలం సి.హెచ్.గున్నేపల్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మురళీకృష్ణ నాయుడు…
ఎన్నికల ముందర హామీ ఇచ్చిన విధంగా కాపులకు ఉద్యోగాల కల్పనలో 5శాతం రిజర్వేషన్లు,కాపులు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసే కాపు కార్పోరేషన్ రూ.15000 కోట్ల కేటాయింపు చేయాలని మురళీకృష్ణ నాయుడు అన్నారు..
ఎపిలో 125 నియోజకవర్గాల్లో గెలుపు,ఓటములును నిర్దేశించే స్థితిలో కాపులు ఉన్నారు.. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తాం…
రాష్ట్రంలో సన్నకారు, చిన్నకారు,కౌలు రైతులు గా ఎక్కువ శాతం ఉన్న కాపులను ఆదుకునేందుకు ప్రభుత్వం దృష్టిపెట్టాలి…కాపులు సమస్యలు పరిష్కారానికి సంఘం కృషి చేస్తుంది…. మురళీకృష్ణ నాయుడు..
సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు బసవ చిన్న బాబు, సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు గొలకోటి వెంకటరెడ్డి.