స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ లో మద్దులూరి మాలకొండయ్య

Cheeral MLA Mudduluri Malakondayya participated in the Swachh Andhra-Swachh Diwas, focusing on cleanliness awareness and public health initiatives. Cheeral MLA Mudduluri Malakondayya participated in the Swachh Andhra-Swachh Diwas, focusing on cleanliness awareness and public health initiatives.

చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్యంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రతి నెలా మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ఉద్యమం రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రతి నెలా ప్రత్యేకమైన థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తామని చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య తెలిపారు.

స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌లో భాగంగా, చీరాల పురపాల సంఘం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మానవహారం నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించి, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రషీద్ గారు, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *