విజయనగరం జిల్లా మెంటాడ మండల పరిషత్ సమావేశ భవనంలో గురువారం టి ఏ డీ ఏలకు రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు మరియు ఎంపీడీవో అనుమతి లేకుండానే కార్యాలయ తలుపులు తెరిచి జరపడం ఆయనను ఆగ్రహానికి గురిచేసింది. వైస్ ఎంపీపీ సారికి ఈశ్వర రావు కూడా ఈ తీరుపై మండిపడుతూ, చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధుల సహకారం లేకుండా సర్పంచులకు తెలియజేయకుండానే నియమించిన టి ఏ డీ ఏ ల పై కూడా విమర్శలు వచ్చాయి. పాత ప్రభుత్వంలో ప్రతి గింజను రైతు నుంచి కొనుగోలు చేయాలన్న నిబంధనలు ఉల్లంఘించడంపై ప్రస్తుత నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా రైతులకు ఇబ్బంది కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎంపీపీ చెప్పారు.
ఈ సమావేశంలో వ్యవసాయం సలహా మండలి అధ్యక్షులు లచ్చిరెడ్డి అప్పలనాయుడు, ఇతర గ్రామ సర్పంచులు, శిక్షణ పొందుతున్న టి ఏ డీ ఏలు, మెంటాడ సొసైటీ సీఈఓ వెంపడాపు ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.