ఖానాపూర్ పట్టణంలోనీ విద్యానగర్ కాలనికి చెందిన బోగోని లక్ష్మి అనే మహిళ కోతులదాడికి మృతి చెందింన విషయం తెలిసిందే,తన ఇంటి ముందు కూచొని ఉన్న తను ఒక్కసారిగా ముకుమ్మదడిగా వచ్చిన కోతుల గుంపును చూసి ఇంటి లోపలి పరిగెత్తుకుంటూ భయపడి వెళ్లగా కింద పడి అక్కడిక్కడే మృతి చెందీంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఇలాంటి దాడులు జరిగిన చూసి చూడనట్టు పట్టించుకోనీ మున్సిపాలిటీ అధికారులు కాలనిలో జీవిస్తున్న ఉన్న ఇండ్ల లోకి చొరబడి విరాంగం చేస్తున్నాయని, పట్టణంలోని మహిళలు వాపోతున్నారు.
ఇప్పటికైనా మున్సీపాలిటీ సిబ్బంది నాయకులు కోతుల బాధ నుండి కాపాడాలని, పట్టణ ప్రజలు, బాధితులు వాపోయారు. ఖానాపూర్ విడిసి సభ్యులు మాట్లాడుతూ… మ గోడు వినండి, మ భాధలు చుడండి ఇప్పటి కైనా గట్టెంకించండి అని తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం వెళ్లి విడిసి సభ్యులు మెమోండా ఇచ్చారు. ఇలాంటివి మరొక్క సారి జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఖానాపూర్ నుండి కోతుల నిర్ములన ప్రారంభిస్తామని అన్నారు. జిల్లా ఫారెస్ట్ ఆఫిసార్ యఫ్ ఆర్ ఓ ఫోన్ చేస్తే కోతులు మ వన్య ప్రాణుల చట్టంలోకి రావని చేతులు దులుపుకున్నరు. ఇప్పుడు ఎవ్వరి భాద్యత అన్నారు.
పట్టణంలో కోతుల బెడదా జిల్లా కలెక్టర్ చేరావేస్తారని అలాగే మృతి చెందిన భోంగోని లక్ష్మి వారి కుటుంబనికి ఆమె పెద్దదిక్కు కుటుంబా సభ్యుల పరిస్థితి అయోమయంగా మారిందాన్నారు. మృతిరాలి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలన్నరు. త్వరలో కోతుల బెడద లేకుండా చేయని యెడల ఖానాపూర్ పట్టణంలో ప్రతి కాలాని వాసులతో ధర్నాలు రాస్తారోకోలు చేస్తామన్నారు. దీంట్లో భాగంగా విడిసి సభ్యులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.