మహిళలకు ఉచిత ప్రయాణం బస్సు కోసం రాష్ట్రంలో 256 బస్సులను తీసుకువస్తున్నామని అతి తొందరలోనే సూపర్ సిక్స్ పథకాలని అందిస్తామని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ ఎమ్ పి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కలిసి మండలం లోని కామరాజు పేట తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతులను మీడియాతో మాట్లాడారు విద్యా సంవత్సరం చివరి నాటికి అమ్మకు వందనం తప్పనిసరిగా అందిస్తామని పూర్తిస్థాయిలో సూపర్ సిక్స్ అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. కేవలం సంక్షేమం మాత్రమే కాదని అభివృద్ధి కూడా ఉండాలని రెండు సమపాలలో తీసుకువెళ్లాలని ధ్యేయమే మా ప్రభుత్వ లక్ష్యమని ఈ లక్ష్యాన్ని నెరవేరడానికి నూటికి నూరు శాతం కష్టపడతామని జ్యోతుల నెహ్రూ అన్నారు.
సూపర్ సిక్స్ పథకానికి కట్టుబడి ఉన్నామన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
